ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రోజు వారీ కూలీల ఆత్మహత్యలు భారీగా పెరిగి పోయాయని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ కీలక ప్రకటన చేశారు. నిన్న లోక్ సభలో కూలీల ఆత్మహత్యలపై కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. 2021 సంవత్సరంలో 3014 మంది కూలీలు ఆత్మహత్య చేసుకున్నారని.. 2014 తో పోలీస్తే, ఈ ఆత్మహత్యల సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగి పోయిందని స్పష్టం చేశారు. గడిచిన ఐదు ఏళ్లలో 6475 మంది ప్రాణాలు తీసుకున్నారని పేర్కొన్నారు. గడిచిన మూడేళ్లలో 19 శాతం ఆత్మహత్యలు పెరిగినట్లు వెల్లడించారు కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్.
అటు ఏపీలో సెక్స్ వర్కర్లు ఎక్కువేనని కేంద్రం కీలక ప్రకటన చేసింది. అటు స్థానిక సెక్స్ కార్మికులను, ఇటు వలస కార్మికులను కలిపి లెక్కిస్తే, దేశంలోనే ఏపీలో సెక్స్ వర్కర్లు ఎక్కువేనని కేంద్రం వెల్లడించింది. హెచ్ ఐవీ ఎయిడ్స్ గణాంకాల ఆధారంగా కేంద్ర ఆరోగ్య శాఖ నివేదికను తయారు చేసింది.