విజయవాడలో దారుణం…బాలికలతో అసహజ శృంగారం..చివరకు !

-

విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. అసహజ శృంగారంకు ఒత్తిడి చేస్తున్నాడని వ్యక్తిని దారుణంగా హత్య చేశారు మైనర్లు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడలోని ఘోర పార్కులో తాగిన మైఖంలో ఉన్న మైనర్లపై అసహజ లైంగిక దాడికి ప్రయత్నించాడు గుర్తు తెలియని వ్యక్తి. లైంగికంగా అనేకరకాలుగా తమను ఇబ్బంది పెడుతున్నాడని తాగిన మైకంలో వ్యక్తిపై కర్రలతో దాడి చేశారు ఇద్దరు మైనర్లు.

గత నెల 30న ఘోర పార్క్ లో ఆన్ నౌన్ డెడ్ బాడీ గుర్తించి విచారణ చేపట్టారు పోలీసులు. ఒంటిపై రక్తపు గాయాలతో ఉన్న డేడ్ బాడీ దర్యాప్తులో అసలు వ్యవహారం బయటపడింది. సీసీ టీవీ ఆధారంగా ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ చేశారు. తమపై అనేక రకాలుగా లైంగిక దాడికి ప్రయత్నిస్తూ ఇబ్బంది పెట్టడంతో కొట్టి వెళ్ళిపోయినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు మైనర్లు. హత్యకు గురైన వ్యక్తీ గురించి ఆరా తీస్తు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గవర్నర్ పేట పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news