లాయర్లకు ఇచ్చే ఫీజులపై చంద్రబాబు సమాధానం చెప్పాలి: లక్ష్మీపార్వతి

-

లాయర్లకు ఇచ్చే ఫీజులపై చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు లక్ష్మీపార్వతి. తన కేసులు విచారిస్తున్న లాయర్లకు వేలకోట్ల ఫీజులు చెల్లించడానికి చంద్రబాబుకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని వైసిపి నేత లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. ‘దోచుకున్న సొమ్మును లాయర్లకు చెల్లించడానికి లోకేష్ ఢిల్లీలో మకాం పెట్టారా? 40 రోజులుగా చంద్రబాబు కోసం 19 మంది లాయర్లు పనిచేస్తున్నారు.

సీనియర్ లాయర్లకు రోజుకు రూ. కోటి నుంచి రూ. 2.50 కోట్ల ఫీజు ఉంది. ఈ డబ్బులు ఎలా వచ్చాయో బయట పెట్టాలి’ అని డిమాండ్ చేశారు. ఇది ఇలా ఉండగా, ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. నవంబర్ 9కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ ఎం. త్రివేదితో కూడిన ధర్మాసనం తెలిపింది. అప్పటివరకు పిటి వారెంట్ పై యధాతధా స్థితి కొనసాగించాలన్న సుప్రీం… చంద్రబాబును అరెస్టు చేయొద్దని పేర్కొంది. స్కిల్ కేసు తీర్పు ముందుగానే ఇస్తామని… అనంతరం ఫైబర్ నెట్ అంశం పరిగణలోకి తీసుకుంటామని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news