ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసిపి పరిస్థితి అత్యంత దారుణంగా తయారైన సంగతి తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితమైన వైసీపీ పార్టీలో ఉండేందుకు ఏ ఒక్క నేత ఇష్టపడడం లేదు. దానికి తగ్గట్టుగానే… ఏపీలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు కూడా పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఒక్కో నేత బయటకు వెళ్తున్నారు.

ఇక తాజాగా.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పదవికి శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్ జకియా ఖానం రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను వ్యక్తిగత సిబ్బంది ద్వారా మండలి చైర్మన్‌కు ఆమె పంపించారు. జకియా ఖానంను 2020 జులైలో ఎమ్మెల్సీగా గవర్నర్ నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.