ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. శాసనసభ సమావేశాలు వచ్చే నెల మూడో వారంలో నిర్వహించే అవకాశం ఉంది. వినాయక చవితి పండుగకి అటు ఇటుగా సమావేశాలను నిర్వహించనున్నారు. సెప్టెంబర్ రెండో వారంలో జరపాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ సీఎం జగన్ లండన్ పర్యటనకు వెళుతుండడంతో అప్పుడు సాధ్యం కాదని భావిస్తున్నారు.
సీఎం విదేశాల నుంచి వచ్చాక మంత్రివర్గ సమావేశం నిర్వహించి అందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా, పోలవరం నిర్మాణంలో తలెత్తిన లోపాల దిద్దుబాటుపై నేటి నుంచి అధ్యయనం చేయాలని కేంద్ర జల్ శక్తిశాఖ నిర్ణయించింది. ఈ బాధ్యతలను ఆ శాఖ సలహాదారు శ్రీరామ్ కు అప్పగించింది. ఇప్పటివరకు తలెత్తిన లోపాలు పునరావృతం కాకుండా చేయాలంటే ఏం చే యాలి? ఎలాంటి నిర్వహణ ప్రమాణాలు అనుసరించాలన్న దానిపై అధ్యయనం చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, CWC, జల్ శక్తిశాఖ అధికారులతో సమావేశమై త్వరలోనే ఒక నిర్ణయానికి రానున్నారు.