తిరుమలలో చిరుతపులి కలకలం రేపింది. ఈస్ట్ బాలాజీ నగర్ బాల గంగమ్మ ఆలయం వద్ద చిరుత సంచారం చేసింది. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన చిరుత దృశ్యాలు కలకలం రేపాయి. ఇది ఇలా ఉండగా కలియుగ ప్రత్యక్షదైవం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు 20 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు.

దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 69,928 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,297 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.21 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.