ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పిస్తామని ప్రకటన చేసి… మంత్రి నారా లోకేష్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. మంగళగిరిలో స్థానికులతో నారా లోకేష్ చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్థానికంగా ఉన్న సమస్యలను నారా లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు మంగళగిరి లోకల్ నాయకులు. ఎన్నికల మేనిఫెస్టోలో ఏమైతే పెట్టామో,ఏం చెప్పామో అవన్నీ పూర్తిచేసేలా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.

డ్రైనేజీ ,రోడ్లు, తాగునీరు, ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పిస్తామని కూడా వెల్లడించారు. గతంలో ఎవరైతే అధికారులు తప్పు చేశారో వాళ్ళని వదిలేది లేదు… వైసిపి పాలన లో తప్పు చేసిన వాళ్ళందరి పేర్లు రెడ్ బుక్ లో ఉంటాయన్నారు. కేంద్ర నిధులు రావాల్సి ఉంది ,అవి రాగానే, మంగళగిరి సమస్యల మీద అధికారులతో సమీక్ష సమావేశం పెడతానని చెప్పారు నారా లోకేష్. నా దృష్టికి వచ్చిన అన్ని సమస్యలను పరిష్కరిస్తానని వెల్లడించారు మంత్రి నారా లోకేష్.