Investment : మీ వయస్సుకి మీరెంత ఇన్వెస్ట్ చెయ్యాలో తెలుసా..?

-

సంపాదించుకునే దాంట్లో కొంతైనా దాచుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సంపాదనలో కొంచెం దాచుకోవడం చాలా అవసరం. మీ వయసుకు మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలి..? ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి చూద్దాం.. అనురాగ్ అనే 42 ఏళ్ల సివిల్ ఇంజనీర్ కేరళలో పుట్టారు. అబుదాబిలో సెటిల్ అయ్యారు నెలకి 2 లక్షల రూపాయలు కంటే ఎక్కువే వస్తుంది. ఇప్పటివరకు కేవలం ఎర్నాకులంలో ఒక ఫ్లాట్ మాత్రమే కొన్నారు.

అయితే ఇంకో అయిదారేళ్లలో ఇండియా తిరిగి వచ్చేబోతున్నారు భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా కొంచమైనా పొదుపు చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటివరకు సరైన ఫైనాన్షియల్ ప్లాన్ లేకుండా గడిపేసానని ఆయన ఇప్పుడు బాధపడుతున్నారు. అయితే కచ్చితంగా ఇలా చేస్తే బాగుంటుంది అని నిపుణులు అంటున్నారు. తక్కువగా ఖర్చు చేయడం, ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం చాలా ముఖ్యం.

30 కంటే తక్కువ వయసు ఉన్నవాళ్లు 90% ఈక్విటీ బేస్డ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు పెట్టాలని లేకపోతె ఇలా ఇన్వెస్ట్ చేయొచ్చు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ లో ఇన్వెస్ట్ చేయండం మంచిదే. మీ సంపాదనలో 10% ఫిక్స్డ్ ఇన్కమ్ స్కీమ్స్ లో పెట్టడం మంచిది. 30 దాటిన వాళ్లు 60 శాతం ఇన్వెస్ట్మెంట్లని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, 25% డెబ్ట్ ఫండ్స్, 15% ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టడం మంచిది.

40 దాటి సింగిల్ ఇన్కమ్ వాళ్ళు 60% ఈక్విటీ బేసిక్ స్కీమ్స్ లో, 20% డెబ్ట్ స్కీమ్స్, 20% బ్యాంకు FDలో పెట్టడం మంచిది. బ్యాంకుల్లో ఫిక్స్ డిపాజిట్ చేయడం వలన 5 నుండి 8% రిటర్న్స్ వస్తాయి. డెబ్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే ఏడు నుంచి 10%, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే 12 నుండి 20%, స్టాక్స్ లో పెడితే 15 నుండి 25% వస్తుంది. అనురాగ్ వంటి వాళ్లు ఇలా ఫాలో అయితే కచ్చితంగా ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో హాయిగా ఉండవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news