మెగా డీఎస్సీ పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని లోకేశ్ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యపై మంత్రి నారా లోకేశ్ సమీక్ష నిర్వహించాడు. జూన్ 6వ తేదీ నుంచి మెగా డీఎస్సీ పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని లోకేశ్ ఆదేశాలు జారీ చేశారు. టీచర్స్ ట్రాన్స్ఫర్ యాక్ట్‌కు అనుగుణంగా ఉపాధ్యాయుల బదిలీలు ఉండాలని సూచనలు చేశారు.

విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే పాఠ్యపుస్తకాలు, కిట్స్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు ఏపీ మంత్రి నారా లోకేశ్. అంబేద్కర్ విదేశీ విద్య పునః ప్రారంభానికి గైడ్‌లైన్స్ రూపొందించాలన్నారు నారా లోకేశ్. అటు ఏపీ బాలికలకు శుభవార్త చెప్పింది కూటమి సర్కార్. ఉన్నత విద్యనభ్యసించే బాలికల కోసం ‘కలలకు రెక్కలు’ పథకాన్ని ఈ ఏడాది నుంచే ప్రారంభించేందుకు విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు ఏపీ మంత్రి నారా లోకేశ్.