మోసపు హామీలతో పోలీసులకూ టోపీ పెట్టారు – జగన్ పై లోకేష్ ఫైర్

-

మోసపు హామీలతో పోలీసులకూ టోపీ పెట్టారు జగన్ మోసపు రెడ్డి అని జగన్‌ పై నారా లోకేష్‌ విరుచుకుపడ్డారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఇవాళ జగన్‌.. వీక్లీ ఆఫ్స్‌ పై మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై నారా లోకేష్‌ స్పందించారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలను అర్పించిన పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా నివాళులర్పిస్తున్నానని తెలిపారు.

మోసపు హామీలతో పోలీసులకూ టోపీ పెట్టారు జగన్ మోసపు రెడ్డి అని ట్వీట్‌ చేశారు లోకేష్‌. ఫిట్మెంట్, సరెండర్ లీవ్స్, టిఎ, డిఎ, వీక్లీ ఆఫ్, జిపిఎఫ్ డబ్బులు, పోలీసు సంక్షేమ నిధులు.. ఏదీ సమయానికి రాక పోలీసులు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. పోలీసులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు . పోలీసు వ్యవస్థ కి దక్కిన గౌరవాన్ని మంటగలిపే విధంగా ఐపిసి పక్కన పెట్టి జేపిసి అమలు చేస్తున్న కొంతమంది పోలీసులు ఈ రోజు నుంచైనా మారతారని ఆశిస్తున్నానన్నారు లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version