సింహాచలంలో గోడకూలి భక్తులు మృతిచెందడంపై YS జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రూ.300 టికెట్ క్యూ లైన్ పై గోడకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్ర విచారం చేశారు YS జగన్. నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు YS జగన్.

ఇది ఇలా ఉండగా విశాఖలోని సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో తీవ్ర విషాదం నెలకొంది. సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కూలి 7 గురు భక్తులు మృతి చెందారు. సింహాద్రి అప్పన్న స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో 7 గురు మృతి చెందారు.