మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కీలక ప్రకటన చేశారు. ఆదివారం నేను జనసేన లో అధికారికంగా చేరబోతున్నానన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి శిష్యుడుగా 2004లో నా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాను….పదేళ్లపాటు కాంగ్రెస్ లో ఉన్నానని వివరించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్కు దూరం అవ్వాల్సి వచ్చింది… 2019లో వైసీపీ నుంచి మచిలీపట్నం ఎంపీగా గెలిచానని పేర్కొన్నారు.
మచిలీపట్నం అభివృద్ధికి నా సాయి శక్తుల కృషి చేశాను..కానీ వైసీపీ ప్రభుత్వంలో డెల్టా ప్రాంతానికి జీవనాధారమైన పోలవరం నిర్మాణం అటకెక్కింది… ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆగ్రహించారు. అందుకే వైసీపీ నుంచి బయటికి వచ్చేస్తున్నానని తెలిపారు. పవన్ కళ్యాణ్ తో భేటీ తర్వాత జనసేన పై పవన్ కళ్యాణ్ పై ఒక మంచి అభిప్రాయం వచ్చింది…విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని తెలిపారు. ఏపీ అభివృద్ధి కోసం భవిష్యత్తు ప్రణాళిక కూడా అద్భుతంగా ఉంది….అందుకే పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణం సాగించాలని నిర్ణయించుకున్నానన్నారు.