రాజకీయం మరి: కొల్లు బయటకు రాకపోతే ఈ టీడీపీ నేతలకు ఫుల్ హ్యాపీ!!

-

ఏపీ మంత్రి పేర్ని నాని అనుచ‌రుడు మేకా భాస్కర‌రావు హ‌త్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్రను అరెస్టు చేసి జైలుకు త‌ర‌లించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో బాబు తన ట్విట్టర్ ఖాతా కవర్ పేజీ ఫోటోలో అచ్చెన్న, జేసీ ల ఫోటో పక్కన కొల్లు రవీంద్ర ఫోటోకూడా పెట్టి “ఫాల్స్ కేసెస్ – ఇల్లీగల్ అరెస్ట్స్” అంటూ తన ఆవేదనను తెలియజేస్తున్నారు! అధినేత అంతలా ఫీలవుతుంటే… మచిలీపట్నం టీడీపీ నేతలు మాత్రం కొల్లు విడుదలను కోరుకోవడంలేదనే కామెంట్లు బందరూ కేంద్రంగా వినిపిస్తున్నాయి!

2014లో గెలిచి మంత్రిగా పనిచేసిన కొల్లు రవీంద్ర… 2019 ఎన్నికల్లో ఫ్యాన్ గాల్లో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉన్నారు. నేరం రుజువైతే ఇప్పట్లో బయటకు రారు.. నేరం రుజువుకాకపోయినా జనాల్లో అప్పట్లో ఉన్నంత విషయం ఉండదు.. అని భావిస్తోన్న స్థానిక టీడీపీ నేతలు.. ఇప్పుడు ఆ స్థానంకోసం పొటీ పడుతున్నారంట! ఇక్కడ ఈ అసెంబ్లీ స్థానంపై క‌న్నేసిన జిల్లా టీడీపీ అధ్యక్షుడు బ‌చ్చుల అర్జునుడు, మ‌చిలీప‌ట్నం మాజీ ఎంపీ కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌లు ఈ సీటును ద‌క్కించుకునేందుకు ప్రయ‌త్నాలు ముమ్మరం చేస్తున్నారని తెలుస్తోంది.

యాద‌వ సామాజిక వ‌ర్గానికి చెందిన అర్జునుడు గ‌త నాలుగు సార్లుగా బంద‌రు ఎమ్మెల్యే సీటు కోసం విశ్వ ప్రయ‌త్నాలు చేస్తున్నారు. ప్రతి సారి క్యాస్ట్ ఈక్వేష‌న్‌లోనే ఆయ‌న‌కు సీటు మిస్ అవుతోంది. అయితే ఈసారి ఏదోలా బీసీ క్యాస్ట్ ఈక్వేషన్ లో సీటు కొట్టాలని పథకాలు రచిస్తుండగా… ఇదే స్థానంపై ఎప్పటినుంచో కన్నేసిన మాజీ ఎంపీ కొన‌క‌ళ్ల నారాయ‌ణ.. త‌న కుమారుడికి ఈ సీటును రిజర్వ్ చేసుకునే ప్రయ‌త్నాలు ముమ్మరం చేస్తున్నారు.

వీరిద్దరి ఆశలు నెరవేరాలంటే.. కనీసం ఆశలు ఆశలుగా మిగిలి, ఇంకా కలలు కనడానికైనా స్కోప్ ఉండాలంటే… కొల్లు బయటకు రావడపై ఆధారపడి ఉంటుంది అనేది బందరు ప్రజల మాటగా ఉంది! సో… వీరికి కొల్లు జైలుకు వెళ్లాడనే బాదకంటే… కొల్లు అనంతరం ఎవరనే తుత్తరే ఎక్కువగా ఉందని అంటున్నారు స్థానికులు!! వీళ్ల ఆత్రుత చూసుంటే మాత్రం… కొల్లు బయటకు రాకపోతేనే హ్యాపీ అన్నట్లుగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

Read more RELATED
Recommended to you

Latest news