రైలులో భజన చేస్తూ తిరుమలకు మాధవి లత

-

వందే భారత్ రైలులో భజన చేస్తూ హైదరాబాద్ నుండి తిరుపతికి బీజేపీ నాయకురాలు మాధవి లత వెళ్లారు. తిరుమల లడ్డూ వివాదంపై తిరుపతికి రైలులో భజన చేస్తూ ప్రయాణించిన మాధవి లత.. ఈ సందర్భంగా మాట్లాడారు. కలియుగ దైవ సన్నిధిలో అనేక ఆకృత్యాలు జరుగుతూనే ఉన్నాయని… ప్రసాదం కలుషితం కావడం మన దౌర్భాగ్యం అని ఫైర్‌ అయ్యారు. ప్రసాదం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది మఠాధిపతులకు, పీఠాధిపతులతో పాటు కోట్ల మందికి విశ్వ వ్యాప్తంగా చేరిందని తెలిపారు.

Madhavi Latha who traveled to Tirupati singing bhajans on the Tirumala Laddu controversy

ప్రసాదం కల్తీ చేసిన వాళ్ళు ఏ మతానికి చెందిన వారైనా ఉండొచ్చు అని తెలిపారు. సనాతన హైందవుడిగా జన్మించి, ఇట్లాంటి భయంకరరమైన పాప భూయిష్టమైన కార్యక్రమాలకు పాల్పడి భాగస్వాములయ్యారన్నారు. నేను కూడా ఒక సనాతన బిడ్డను…. ఈ పాప ప్రాయచిత్తం కోసం ఏడుకొండల వారి దగ్గరకు కాలినడకన వెళ్తామని ప్రకటించారు. వేంకటేశ్వర స్వామిని భక్తి పూర్వకంగా దర్శనం చేసుకొని, క్షమాపణ లేఖను స్వామి వారి హుండీలో వేస్తామని.. స్వామివారిని క్షమాపణలు కోరుతామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news