ఇల్లు మునిగితే.. 25 వేలు ఇస్తే ఏ మూలకి సరిపోతుంది : మల్లాది విష్ణు

-

వరద వస్తుందని ముందే తెలిసినా చంద్రబాబు పట్టించుకోలేదు. చంద్రబాబు నిర్లక్ష్యమే ప్రజలను ముంచేసింది. కానీ చంద్రబాబు వైఫల్యాన్ని అధికారుల మీదకు నెట్టే ప్రయత్నం చేశారు అని అన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. వరదల్లో కాలనీలకు కాలనీలే నీటిలో మునిగిపోయాయి మేము క్షేత్రస్థాయిలో పరిశీలించాక రూ.7 వేల కోట్ల నష్టం జరిగినట్టు అనిపించింది. ఇక వరదల్లో ఇల్లు మునిగితే రూ. 25 వేలు ఇస్తే ఏ మూలకి సరిపోతుంది అని ప్రశ్నించిన విష్ణు.. ఫర్నీచర్ విలువ, వాహనాల విలువ చంద్రబాబుకు తెలుసా అని అన్నారు.

కానీ బాధితుల కష్టాలు చూసి జగన్ చలించిపోయారు. అందుకే మా వంతుగా బాధితులకు సాయం అందించాం. ప్రభుత్వం రైతులకు పదివేలు ఇస్తే ఏం సరిపోతుంది. కాబట్టి చంద్రబాబు ప్రకటించిన ప్యాకేజీని పెంచాలి. ఆస్తి పన్నును రద్దు చేయాలని కోరతున్నాం. ఒక నెల కరెంటు బిల్లును పూర్తిగా రద్దు చేయాలి. నష్టపోయిన ఆటోల స్థానంలో ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి కొత్తవి ఇప్పించాలి. రెండు లక్షల వడ్డీలేని రుణాలను చిన్న పరిశ్రమల వారికి ఇప్పించాలి. 7 వేల కోట్ల నష్టం జరిగితే 7 వందల కోట్లతో సరిపెట్టేలా చూడటం భావ్యం కాదు. వరదల వైఫల్యానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని మల్లాది విష్ణు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version