తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారు : చంద్రబాబు

-

తిరుమల ప్రసాదంపై విషయంలో గత ప్రభుత్వ తీరుపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. తిరుమల ప్రసాదంలో యానిమల్ ఫాట్ వాడారంటూ చంద్రబాబు కామెంట్స్ చేశారు. అన్ని ట్రస్ట్ బోర్డుల్లో బ్రహ్మీన్.. నాయీ బ్రహ్మీన్ను మెంబర్లుగా వేస్తున్నాం. విభజన హామీలపై తెలంగాణ, కేంద్రంతో చర్చిస్తున్నాం. విభజన హామీలు నెరవేర్చేలా కేంద్రం కూడా సహకరిస్తోంది.

ఇక టీటీడీలో ఎన్నో అక్రమాలు చేస్తున్నారు.. ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయి. అన్న ప్రసాదంలో క్వాలిటీ లేకుండా చేశారు. ప్రసాదంలో నాసిరకం మెటిరీయల్ వాడుతున్నారు. వెంకటేశ్వరస్వామి పవిత్రత దెబ్బతీస్తున్నారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదాన్ని అపవిత్రం చేస్తున్నారు. తిరుమల ప్రసాదంలో నెయ్యికి బదులు యానిమల్ ఫాట్ వాడారు. కానీ ఇప్పుడు స్వచ్ఛమైన నెయ్యిని వాడాలని సూచించాం. వెంకన్న ఏపీలో ఉండడం మన అదృష్టం. వెంకన్న పవిత్రతను కాపాడేలా చర్యలు తీసుకుంటాం అని చంద్రబాబు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version