3వ సారి దేశ ప్రధాని నరేంద్ర మోడీనే – మంచు మోహన్ బాబు

-

3వ సారి దేశ ప్రధాని నరేంద్ర మోడీనే అంటూ సంచలన కామెంట్స్‌ చేశారు మంచు మోహన్ బాబు. ఇవాళ తిరుపతికి వచ్చారు మోహన్‌ బాబు. ఈ సందర్భంగా 3వ సారి మంచు మోహన్ బాబు మాట్లాడుతూ…కోటిహనుమాన్ చాలీసా తిరుపతిలో జరగడం మనందరి అదృష్టం…ఈ రోజు నేను ఏమి మాట్లాడినా అతిశయోక్తి కాదన్నారు. మోడీ లేకపోతే ఈ పరిస్థితులు లేవు…కులాలు అనేవి లేవు,తెలిసో తెలియకో అజ్ఞానులు కులాల గురించి మాట్లాడుతున్నారని వెల్లడించారు.

Manchu Mohan Babu Comments on pm modi

కానీ మోడీ ఒక్కరే అందరూ కలిసుండాలని చెప్పారన్నారు. అయోధ్య ఒక చరిత్ర అని.. ఎల్లప్పుడూ ఆయనే మనకు భారత ప్రధానిగా వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని వెల్లడించారు.
మోడీ ప్రధాని కాక ముందే ఆయన్ని నేను ఫ్యామిలీతో కలిశానని..మోడీ రెండు సార్లు విజయం సాధించారు. మళ్లీ విజయం సాధించ బోతున్నారని స్పష్టం చేశారు. అయోధ్య రామ మందిరం కు ఆహ్వానం వచ్చిందన్నారు మోహన్‌ బాబు.

Read more RELATED
Recommended to you

Latest news