ఒంగోలు వైసీపీ ఎంపీగా వైవీ సుబ్బారెడ్డి పోటీ చేస్తారని వస్తున్న ప్రచారంపై ఆయనే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఒంగోలు ఎంపీగా పోటీ చేయనని పలు దఫాలు సీఎం జగన్ కు చెప్పాను..పోటీ చేసేవాడ్ని అయితే 2019 లోనే పోటీ చేసుండేవాడ్ని.. కంటిన్యూ అయ్యేవాడ్ని అంటూ వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి. ప్రత్యక్ష రాజకీయాలు గ్యాప్ రావటంతో పార్టీ పనులు చూస్తున్నా..పక్కన ఉన్నా కాబట్టి పార్లమెంటుకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని సీఎం జగన్ కు చెప్పానని వెల్లడించారు.
పోటీ విషయంలో అంతిమంగా సీఎం జగన్ నిర్ణయానికి శిరసావహిస్తానని.. సీనియర్ నేతలు పార్టీని వీడటానికి వారి వ్యక్తిగత కారణాలు వారికున్నాయని చెప్పారు.సీట్ల మార్పు విషయంలో సీఎం జగన్ స్పష్టంగా ఉన్నారు..గెలుపునకు దూరంగా ఉన్న అభ్యర్దులను సీట్లు ఉండవని ముందు నుంచి సీఎం జగన్ చెబుతున్నారని వెల్లడించారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి. సీట్లు ఇవ్వని వారు కొత్తవాళ్లతో అడ్జస్ట్ అవ్వటానికి కొంచెం టైం పడుతుంది.. అన్నీ సర్దుబాటు అవుతాయి..అల్టిమేట్ గా ట్రాక్ రికార్డును బట్టే ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఫైనల్ అవుతాయన్నారు. కొత్త మార్పులు, చేర్పులకు సంభందించి పండుగ తర్వాత ఫైనల్ లిస్ట్ వస్తుందని ప్రకటించారు.