వర్షాలు వరదల దెబ్బకి విమాన ప్రయాణాలకు పెరిగిన రద్దీ..!

-

ఏపీలో కురుస్తున్న భారీ వర్షలకు చాలా చోట్ల ఇళ్లలోకి నీళ్లు వచ్చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వర్షాలు వరదల దెబ్బకి విమాన ప్రయాణాలకు రద్దీ భారీగా పెరిగింది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు, రైలు మార్గాలలో అంతరాయం ఏర్పడడంతో.. గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువైంది. ఇక పెరిగిన రద్దీతో టికెట్ కౌంటర్ల వద్ద భారీగా క్యూలైన్ లు దర్శనం ఇస్తున్నాయి. అలాగే పెరిగిన ప్రయాణీకులకు తగిన విమానాలు లేకపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు.

ఇదే సమయంలో విజయవాడ బస్టాండ్ గందరగోళంగా మారింది. బస్సులు ఉన్నాయో రద్దు అయ్యాయో తెలియక ప్రయాణికుల అవస్థలు పడుతున్నారు. ట్రైన్స్ రద్దు కావడం, డైవర్ట్ కావడంతో ప్రయాణికులను బస్టాండ్ కి తీసుకు వస్తున్నారు రైల్వే అధికారులు. దాంతో గంటల తరబడి బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు ప్రయాణికులు. ఇక వచ్చిన బస్సులు నిమిషాల్లోనే ఫుల్ అయిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ వెళ్లే బస్సులకు ఫుల్ డిమాండ్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news