ఏపీ రైతులకు శుభవార్త..నేడు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు పంపిణీ చేయనున్న జగన్

-

ఏపీ రైతులకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఇవాళ గుంటూరు జిల్లాలో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చుట్టుగుంటలో వైఎస్సార్ యంత్ర సేవ-2 కార్యక్రమంలో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పర్యటించనున్నారు.

రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు పంపిణీ చేయనున్నారు ఏపీ సీఎం జగన్. ఇక అటు నిన్న వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ నిధులు విడుదల చేశారు సీఎం జగన్‌. ఇప్పటికే వరుసగా ఐదో ఏడాది.. ఈ ఏడాదికి మొదటి విడత ఆర్ధిక సాయం చేయనున్నారు. రైతులకు ఏటా 13,500 రూపాయల ఆర్ధిక సహాయం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు పై విరుచుకుపడ్డారు సీఎం జగన్‌. చంద్రబాబు చెప్పేవన్ని వెన్నుపోటు మాటలంటూ ఫైర్ అయ్యారు జగన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version