తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీపై ఉండదు – మంత్రి మేరుగ

-

తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే….టీడీపీ సంబరాలు చేసుకోవడం ఏంటి అని ఫైర్‌ అయ్యారు మంత్రి మేరుగ నాగార్జున. ఇవాళ అనంతపురం జిల్లాలో మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ… చంద్రబాబు పెద్ద గజదొంగ అని ఆగ్రహించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే….టీడీపీ సంబరాలు చేసుకోవడం విడ్డూరం అన్నారు.

meruga nagarunaja comments on telangana

ఎవరికో పుట్టిన బిడ్డను…తన బిడ్డగా చెప్పుకోవడం చంద్రబాబు నైజం అంటూ నిప్పులు చెరిగారు మంత్రి మేరుగ నాగార్జున. తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీపై ఎలాంటి ప్రభావం చూపదన్నారు మంత్రి మేరుగ నాగార్జున. తెలంగాణలో ఎవరు గెలిస్తే ఏంటి…ఎవరు ఓడిపోతే మాకేంటి..?? తెలంగాణలో టీడీపీ బలం ఉందని చెప్పుకుంటున్న స్థానాల్లో బీఆరెస్స్ ఎలా గెలిచిందని వివరించారు మంత్రి మేరుగ నాగార్జున. వ్యాట్ కంటే ముందు నుంచీ ఉన్న వ్యవస్ధలో మార్పులు చేసామని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news