పర్యాటక కేంద్రంగా అంబేడ్కర్ స్మృతి వనం: మంత్రి మేరుగు

-

పర్యాటక కేంద్రంగా అంబేద్కర్ స్మృతి వనాన్ని నిర్మిస్తున్నట్లు మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ విగ్రహం, స్మృతివనాన్ని పరిశీలించిన ఆయన విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్నట్లు వివరించారు. నవంబర్ 26న సీఎం జగన్ స్మృతి వనంను ప్రారంభిస్తారన్నారు. అంబేద్కర్ విగ్రహం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుందని పేర్కొన్నారు.

అటు ఇంటింటికీ ఆరోగ్య రక్ష కు జగన్ సర్కార్ సన్నాద్ధం అయింది. రేపట్నుంచి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టనుంది ఏపీ సర్కార్. జగనన్న సురక్ష తరహాలోనే ప్రజల కోసం మరో కార్యక్రమం చేపట్టనుంది. పౌరుల ఆరోగ్య సమస్యలను గుర్తించి పరిష్కరించడమే లక్ష్యంగా ఏపీ సర్కార్ ముందుకు వెళుతోంది. అనారోగ్య బాధితులను చేయి పట్టుకుని నడిపించే వ్యవస్థకు నాంది.. 5 దశల్లో కార్యక్రమం.. ఉచితంగా 7 రకాల పరీక్షలు నిర్వహించనుంది ఏపీ సర్కార్. 15 నుంచి వలంటీర్లు, గృహ సారథులు, ప్రజాప్రతినిధుల క్యాంపెయిన్ చేయనున్నారు అధికారులు. ఈ నెల 30 నుంచి నలుగురేసి డాక్టర్లతో హెల్త్ క్యాంప్లు లు నిరావహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news