మినిస్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. విశాఖ మహానగరం ఖ్యాతిని మరింత పెంచేలా అభివృద్ధి ప్రణాలికలు రూపొందించాలన్న మంత్రి.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి విశాఖ నగరం నుంచి 45 నిమిషాల్లో చేరుకునేలా రోడ్లను అభివృద్ధి చేయాల్సి ఉంది అన్నారు. అలాగే లంకెలపాలెం నుంచి భోగాపురం చేరుకునే వరకు 12 కూడళ్లు ఇబ్బంది కరంగా ఉన్నాయి.. అక్కడ ఫ్లైఓవర్లు వేయాలి అని తెలిపారు.
ఇక ప్రస్తుతం ఉన్న జాతీయ హైవే -16ను విస్తరించటం లేదా బీచ్ సమీపంలో రోడ్డును ఎయిర్పోర్ట్ కు అనుసంధానం చేయడంపై సుధీర్ఘ చర్చ జరిపారు. దీనిపై జి.ఎం.ఆర్. గ్రూప్ ప్రతినిధుల పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. నగర మాస్టర్ ప్రణాళికపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు వి.ఎం.ఆర్.డి. ఎ. కమిషనర్. కాలుష్యం నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని సమష్టి నిర్ణయం తీసుకున్నారు. అలాగే నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు వినూత్న చర్యలు చేపట్టామని చెబుతూ పోలీస్ కమిషనర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో తెలిపారు. ఇక పంచగ్రామాల సమస్యను ఓ కొలిక్కి తీసుకురావాల్సి ఉందని.. సైక్లోన్స్ వచ్చే ప్రాంతం కాబట్టి వర్షపు నీరు నిల్వ ఉండకుండా.. ప్రమాదాల జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి అని మంత్రి అన్నారు.