గత ఐదు ఏళ్ళల్లో కోట్ల రూపాయల ఇసుక దోపిడీ జరిగింది : మంత్రి నిమ్మల

-

కొవ్వూరు ఔరంగాబాద్ వాడపల్లి ఇసుక ర్యాంపులను తనిఖీ చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు.. ఉచిత తీసుకుని ప్రజలకు అందించడమే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. ఇసుక ర్యాంపులలో ఆన్లైన్ ఆఫ్ లైన్ విధానాల్లో కొద్దిపాటి లోపాలు ఉన్నాయి. కానీ ఆ లోపాలు సరిచేయమని అధికారులను ఆదేశించాం అని మంత్రి పేర్కొన్నారు. గత ఐదు సంవత్సరాలలో జేపీ సంస్థను అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్ ప్రభుత్వం కోట్ల రూపాయల ఇసుక దోపిడీ జరిగింది అన్నారు.

అయితే అన్ని ఇసుక ర్యాంపులలోని పది రోజులలో పూర్తిస్థాయిలో ఇసుక నిలువలు అందించేలా చర్యలు తీసుకుంటున్నాము. వారం రోజులలో బిల్లులు పడవ కార్మికులకు చెల్లించాలని ఆదేశిస్తాం. రేపటి నుంచి డ్రమ్ములు.. ఆఫ్లైన్ ఇసుక అందించే విధంగా చర్యలు తీసుకుంటాం. అలాగే త్వరలో ఓపెన్ ర్యాంపులకు అనుమతులు వస్తాయి. ఇక ఉచిత ఇసుక విధానంలో అవకతవకలు ఉంటె అధికారుల పై చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి నిమ్మల.

Read more RELATED
Recommended to you

Exit mobile version