తెలంగాణలో బిజెపితో, ఏపీలో టీడీపీతో పొత్తు దేనికి సాంకేతం అని ప్రశ్నించారు మంత్రి చెల్లుబోయిన వేణు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు. రాజకీయ విలువలకు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నారు…ఒక ఎన్నికలకు ఒక్కోక విధానం అని ఫైర్ అయ్యారు. తెలంగాణలో బిజెపితో పొత్తు, ఏపీలో టీడీపీతో పొత్తు దేనికి సాంకేతం…పవన్ ను ఒక టూల్ గా వాడుతున్నారని ఎద్దేవా చేశారు.
పవన్ అభిమానులు ఆవేశపరులు.. కాపు సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని టిడిపిని అధికారంలోకి తీసుకుని రావాలని పవన్ ప్రయత్నం చేస్తున్నాడని ఆగ్రహించారు. ముద్రగాడను శోభకు గురి చేసింది చంద్రబాబు… మరోసారి కాపులు సామాజిక వర్గాన్ని మోసం చేయడానికి చంద్రబాబు ప్రయత్నం అంటూ మండిపడ్డారు. చంద్రబాబు మోసానికి కాపులు నష్టపోతారని పవన్ గ్రహించాలని కోరారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, మరో 14 ఏళ్లు ప్రతిపక్ష నేతగా చేసిన చంద్రబాబు శకం ముగిసిందన్నారు. చెప్పింది చెప్పినట్టు చేసే నాయకుడు జగన్ అని కొనియాడారు.