గత ప్రభుత్వంలో లిక్కర్ పాలసీని తనకి అనుగుణంగా మార్చుకొని జగన్ చాలా అవినీతికి పాల్పడ్డాడు. జగన్ ఎక్సైజ్ డిపార్మెంట్ నీ విడగొట్టి నాశనం చేశాడు అని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. జగన్ జే బ్రాండ్స్ వల్ల మందు తాగుతున్న వారి ఆరోగ్యం చెడిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెరుగైన మధ్య పాలసీని తెచ్చాం. త్వరలో అన్ని బ్రాండ్స్ పైన రెట్లు తగ్గించే అవకాశాన్ని పరిశీలిస్తున్నాం. MRP రేట్ల కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాము. 99 రూపాయలకే నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నాము. పారదర్శకంగా నూతన మద్యం పాలసీని అమలు చేస్తున్నాము.
మద్యంలో గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై సిబిసిఐడి విచారణ జరుగుతుంది. గత ప్రభుత్వంలో మద్యంలో 19 వేల కోట్లు దోచుకున్నారు. వారి స్వార్ధం కోసం రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఇక మద్యం షాపులలో డిజిటల్ పేమెంట్స్ ను ప్రేవేశపడతాం. గుడికి, బడికి 100 మీటర్ల దూరంలో మద్యం షాప్ లు పెట్టేలా చర్యలు తీసుకుంటున్నాము. రెసిడెన్సి ఏరియాలో షాప్ లు పెట్టటప్పుడు సమస్యలు ఉంటే ప్రత్యామ్నాయంగా స్థానికంగా ఉన్న గ్రామీణ ప్రాంతంలో పంచాయితీ అనుమతులు తీసుకొని షాప్ లు ఏర్పాటు చేస్తున్నాము అని కొల్లు రవీంద్ర వివరించారు.