మద్యం దుకాణాల పంపిణి చాలా పక్కడబందిగా చాలా ట్రాన్సపరెంట్ గా చేసాము అని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. 89882 మంది అప్లై చెయ్యడం ఇది ఫస్ట్ టైం. ఒక్కో షాప్ కు సగటున 25 మంది వేశారు. దాంతో ప్రభుత్వానికి 1798 కోట్లు ఆదాయం వచ్చింది. ఇందులో మోనోపోలికి రాజకీయాలుకి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. 16 నుండి సేల్స్ స్టార్ట్ చెయ్యడం జరుగుతుంది.
అప్లై చేసిన వారు కూడా అందరు పద్దతిగా వ్యవహారించారు. సహకరించిన అన్ని శాఖ ల అధికారులకు ధన్యవాదాలు. సబ్ కమిటీ ఇచ్చిన సలహాలు కూడా చాలా విలువైనవి . MRPకి మించి అమ్మడానికి లేదు. నిబంధనలకు విరుద్ధం గా వ్యవహరిస్తే చర్యలు తప్పవు.మహిళలు వ్యాపార రంగం లో ముందుకు వెళ్ళాలి. వాళ్ళు పాల్గొనడం సంతోషం. మార్నింగ్ 10 నుండి సాయంత్రం 10 వరకూ సేల్స్ జరుగుతాయి. ఎన్ఫోర్స్మెంట్ ను స్ట్రిక్ట్ చేసాము. కొత్త బ్రాండ్స్ కు టెండర్ కమిటీ ద్వారా ఫైనల్ చేసి తీసుకుంటాము అని మంత్రి పేర్కొన్నారు.