ఆ ఒక్క విషయంలో మాత్రం టీడీపీని ఫాలో అవుతున్న బీఆర్ఎస్.. ఎందుకంటే..

-

తెలంగాణ ఉద్యమాలతో రాటుదేలిక కేసీయార్.. రెండు దఫాలు సీఎంగా పనిచేశారు.. తొమ్మిదేళ్ల పాటు కాంగ్రెస్ ,బిజేపీ నేతలకు అధికారాన్ని దక్కనివ్వకుండా.. తన హస్తగతం చేసుకున్నారు.. మరోసారి ముచ్చటగా అధికారంలోకి వస్తామని భావించి.. బోర్లా పడ్డారు.. అధికారంలో ఉన్న సమయంలో పార్టీ పటిష్టత గురించి ఆయన పెద్దగా పట్టించుకోలేదు.. క్యాడర్ ను కూడా లైట్ తీసుకున్నారనే విమర్శలు కూడా వినిపించాయి..

కాంగ్రెస్ దెబ్బకు ప్రతిపక్షంలోకి వచ్చిన బీఆర్ఎస్ .. ఇప్పుడు పార్టీ పటిష్టతకు ప్రాధాన్యత ఇస్తోంది.. సమూల మార్పుల దిశగా అడుగులేస్తుంది.. అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ భవన్లో పెద్దగా హడావుడి ఉండేది కాదు.. కేసీయార్ ఫామ్ హౌస్ నుంచి పాలన చేస్తుంటే.. మంత్రులు నియోకవర్గాల్లో, హైదరాబాద్ లో ఉండేవారు.. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది.. పార్టీ నిర్మాణంపై ఆ పార్టీ నేతలు దృష్టి పెడుతున్నారు..

పార్టీ నిర్మాణం, కార్యాలయ కార్యకలాపాల విషయంలో తెలుగుదేశం పార్టీ స్టాటజీని బీఆర్ఎస్ ఫాలో అవుతోందట.. ఆ పార్టీలాగానే సిస్టమేటిక్ గా నిర్వహణ చేసేందుకు నేతలు సిద్దమవుతున్నారు.. టీడీపీలో కీలక నేతగా, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మెంబర్ గా ఉన్న కేసీయార్ కు టీడీపీ విధానాలు బాగా తెలుసుకున్నారు.. ఆ సిద్దాంతాలను పాలో అయితే సక్సెస్ అవ్వొచ్చన్న అభిప్రాయం కేసీయార్ కు వచ్చిందట.. అందుకే తెలంగాణ భవన్ కు ఇన్చార్జిని పెట్టి.. ముఖ్యనేతలు అక్కడే ఉండేలా ప్లాన్ చేస్తున్నారట..

తెలంగాణ భవన్ కు రావుల చంద్రశేఖర్ ను ఇన్చార్జిగా నియమించి బీఆర్ఎస్.. నిత్యం ఎవరో ఒక నేత తెలంగాణ భవన్‌లో అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది.. రోజుకు రెండు నుంచి మూడు ప్రెస్ మీట్లు ఉండేలా చూస్తోంది.. పార్టీ కార్యకర్తల మెంబర్‌షిప్‌తో పాటు, ఇన్సూరెన్స్ కోసం ప్రత్యేక విభాగం, సోషల్ మీడియా విభాగం వంటివి ఏర్పాటు చేసింది.. ఇటీవల కొద్దిరోజుల నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తెలంగాణ భవన్లో కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు.. ఇది కూడా స్టాటజీలో భాగమేనని పార్టీలో చర్చ నడుస్తోంది.. మొత్తంగా పార్టీ పటిష్టత మీద బీఆర్ఎస్ దృష్టి పెట్టిందన్నమాట..

Read more RELATED
Recommended to you

Exit mobile version