పీడిభీమవరం పారిశ్రామిక వాడాలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు. ఈ క్రమంలో వివిధ పరిశ్రమల ప్రతినిధులతో మంత్రి సమావేశం ఏర్పాటు చేసారు. అందులో మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుంది. పారిశ్రామిక అభివృద్ధి ద్వారా రాష్ట్రంలో ఉద్యోగ ఉపాది అవకాశాలు పెంపొందిస్తాం. పారిశ్రామిక వేత్తలు సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తాం అని అన్నారు.
అలాగే తారకరామ ప్రాజెక్టును పూర్తి చేసి పైడి భీమవరం పారిశ్రామిక వాడ పరిసరాల్లో నీటి అవసరాలు తీరుస్తాం. అయితే వ్యర్ధ జలాల నిర్వహణ కోసం చిన్న పరిశ్రమలు ముందుకు రావాలి అని కోరారు. ఇక కేంద్రం ఇచ్చే 70 శాతం గ్రాంట్స్ తో ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. యువతలో నైపుణ్యాభివృద్ది కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నం. కాలుష్య నియంత్రణకు చర్యలు చేకూడతాం. అలాగే ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ కౌన్సిల్ పూర్తి స్థాయిలో పని చేసేవిధంగా ఆదేశాలిచారు మంత్రి.