ధాన్యం అమ్మిన 24 గంటల్లో నగదు జమ : నాదెండ్ల మనోహర్

-

ఇప్పటి వరకూ రాష్ట్రంలో 418.75 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలులో.. 391:50 కోట్లు రైతుల‌ ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 24 గంటల్లోపు 281.30 కోట్లు రైతులు ఖాతాలో జమ చేసాం. 24 గంటల నుంచి 48 గంటల్లో రైతు ఖాతాల్లో జమ చేసిన నగదు 10.20 కోట్లు. ఇక ధాన్యం అమ్మిన రైతు ఖాతాల్లో 24 నుంచీ 48 గంటల్లో నగదు జమ చేసే విధానం అమలులోకి తెచ్చింది కూటమి ప్రభుత్వం అని మంత్రి పేర్కొన్నారు.

తూర్పుగోదావరి, ప‌శ్చిమ‌గోదావరి, ఏలూరు, కాకినాడ‌, కోన‌సీమ‌, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మొత్తం 617 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసాం. 24051 మంది రైతుల నుంచి 1,81,988 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసాం. ధాన్యాన్ని ఎప్పుడు ఎక్కడ అమ్ముకోవాలో రైతులే నిర్ణయించుకునేలా వాట్సాప్ చాట్‌ బోర్డ్‌ తెచ్చాము. రైతులు కొనుగోలు కేంద్రాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మొబైల్ ద్వారా ప్రత్యేక వాయిస్ సేవలు తీసుకొచ్చాము. గోతాల సరఫరా నుంచి రవాణా వరకు అన్ని విధానాలు సులభతరం చేసాం ని మంత్రి మనోహర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news