విజయవాడ వరద ప్రాంతాల్లో తాజాగా మంత్రి నారాయణ పర్యటించారు. కండ్రిక ప్రాంతాల్లో ఇళ్ల క్లీనింగ్ ప్రక్రియను పరిశీలించిన మంత్రి నారాయణ అనంతరం మాట్లాడుతూ.. వరద ప్రాంతాల్లో పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడే ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. ఇళ్లను క్లీనింగ్ చేయడం కోసం ప్రభుత్వం ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేసింది. నిన్న కొందరు మళ్ళీ వరద వస్తుంది అంటూ విషప్రచారం చేశారు. దీనిని మేము వైసిపి కుట్రగా భావిస్తున్నాం అన్నారు.
అలాగే ఈ విషప్రచారం పై డిజిపి కి ఫిర్యాదు చేశాం అని పేర్కొన్నారు మంత్రి. అదే విధంగా.. ఎవరు విషప్రచారం కి పాల్పడ్డరో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అన్నారు. ఇక చంద్రబాబు ప్రభుత్వం వరద బాధితులకు మొదటి రోజు నుండి అండగా నిలబడింది. విపత్తు నుండి ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టెక్కించారు. చంద్రబాబు పాలన దక్షతను చూసి ఓర్వలేని వైసిపి కుట్రలకు, విషప్రచారానికి దిగింది. ఇది సిగ్గుమాలిన, నీతిమాలిన చర్య అని పేర్కొన్నారు మంత్రి నారాయణ.