కొత్త ఏడాది బీఆర్ఎస్ కు ఎలా ఉండబోతుంది..? వారి ముందున్న సవాళ్లు ఏంటంటే..?

-

గులాబీ పార్టీకి కొత్త ఏడాది అనేక సవాళ్లు ఎదురవ్వబోతున్నాయి.. గతేడాదిలాగే ఈఏడాది కూడా పోరాటాలు, ఆందోళనలు, జంపింగ్ లు తప్పలాలేవ్.. క్యాడర్ కు భరోసా ఇస్తూ.. కాంగ్రెస్ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని కారు పార్టీ భావిస్తుంటే.. అధికార పార్టీ మాత్రం మరోలా ప్లాన్ చేస్తోంది.. ఇంతకీ కారు పార్టీ మందున్న చాలెంజెస్ ఏంటో చూద్దాం..

తెలంగాణ రాజకీయాలు చలికాలంలో కూడా వేడిపుట్టిస్తున్నాయి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల దాకా ఒక రేంజ్ లో రాజకీయాలుంటే.. ప్రస్తుతం అంతకు మించి అన్నట్లుగా రాజకీయాలు నడుస్తున్నాయి.. ఇదే సమయంలో త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి.. ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు సిద్దమవుతున్నాయి..

కొత్త ఏడాదిలో జరగబోయే ఎన్నికల్లో పైచేయి సాధించి.. క్యాడర్లో జోష్ నింపేందుకు పార్టీలన్నీ పావులు కదుపుతున్నాయి.. ఇదే సమయంలో బీఆర్ఎస్ భవిష్యత్ పై చర్చ జరుగుతోంది.. 2024 బీఆర్ఎస్ కు గడ్డుకాలమనే చెప్పాలి.. కవిత అరెస్ట్, ముఖ్యనేతలు జంపింగ్, కేటీఆర్ పై కేసులు వంటివి జరిగాయి..ఈ ఏడాది కూడా గులాబీ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురుకాబోతున్నాయన్న చర్చ జరుగుతోంది..

2024లో కలిసిరాని అంశాలే..ఇప్పుడు కూడా పార్టీని వెంటాడతాయని పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరుగుతోంది.. బీఆర్ఎస్ హయంలో అవినీతి అక్రమాలు జరిగాయంటూ కేసులు నమోదయ్యాయి.. కొత్త ఏడాదిలో విచారణతో పాటు.. అరెస్టులు కూడా ఉండే అవకాశముందన్న ప్రచారం కూడా నడుస్తోంది.. ఫార్ములా ఈకార్ రేస్ లో కేటీఆర్ కూడా ఇబ్బంది పడుతున్నారు.. వాటితో పాటు స్తానిక సంస్థల ఎన్నికలు కూడా ఈ ఏడాదిలోనే రాబోతున్నాయి.. ఇవి కూడా బీఆర్ఎస్ తలనొప్పిగా మారే అవకాశముందని తెలుస్తోంది.. 2025 కూడా బీఆర్ఎస్ కు పరీక్షా కాలమేనన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది..

Read more RELATED
Recommended to you

Latest news