సోమవారం చిత్తూరు జిల్లా పుంగనూరులో పర్యటించిన వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల విభజన అనేది ఇప్పట్లో లేనే లేదని అన్నారు. కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువచ్చిందని, జనగణన ఇంకా అవ్వలేదని అన్నారు. అది జరిగిన తర్వాతే నియోజకవర్గాల విభజన జరుగుతుందన్నారు మిథున్ రెడ్డి.
ఒకవేళ పుంగనూరును రెండు నియోజకవర్గాలుగా విభజిస్తే ఒక నియోజకవర్గం నుండి తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. పుంగనూరు అభివృద్ధికి కట్టుబడి ఉంటామన్నారు మిథున్ రెడ్డి. పుంగనూరు నియోజకవర్గం తనకు తల్లి లాంటిదని.. ఆ ప్రేమతోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు.
వక్ఫ్ బోర్డ్ బిల్లు మైనారిటీలకు వ్యతిరేకంగా ఉందన్నారు. ఈ విషయంలో ముస్లింలకు అండగా వైసిపి నిలబడుతుందని హామీ ఇచ్చారు మిథున్ రెడ్డి. వక్ఫ్ బోర్డు బిల్లును తాము వ్యతిరేకించామని.. మళ్లీ పార్లమెంటులో ముస్లింలకు వ్యతిరేకంగా ఉంటే దానికి తాము మద్దతు ఇవ్వమని స్పష్టం చేశారు.