జెసి ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్..మగాళ్లు అయితే అడుగు పెట్టండి !

-

జెసి ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్ విసిరారు. మగాళ్లు అయితే నా తోట అడుగు పెట్టండని సవాల్‌ చేశారు. అనంతపురం లో ఇవాళ మీడియాతో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి మాట్లాడుతూ… క్రాప్ ఇన్సూరెన్స్ అందరి రైతులకు వచ్చినట్లే నాకూ పంట బీమా వచ్చిందన్నారు. జెసి ప్రభాకర్ రెడ్డికి వ్యవసాయం అంటే తెలియదు… కాబట్టి ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఫైర్‌ అయ్యారు.

ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామ్ రెడ్డి
ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామ్ రెడ్డి

జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తిని ఈ రాష్ట్రంలో నేను ఎవరిని చూడలేదన్నారు.
పుట్లూరు, ఎల్లనూరు మండలాలలో మగాడు అనే వాడు ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డి తోపాటు నా తోటలో అడుగు పెట్టు చూడని సవాల్‌ చేశారు. నాకు ఎమ్మెల్యే పదవి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భిక్ష అన్నారు. ఇది ఇలా ఉండగా, ఇవాళ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. సింగనమల నియోజకవర్గంలోని పుట్లూరు, యల్లనూరు మండలాలలో ఉన్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తోటకు వెళతాను అని సవాల్ చేసిన జేసీని అరెస్ట్‌ చేశారు పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Latest news