వామ్మో సమంత మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా.. మరి వర్కౌట్ అవుతుందా.?

-

ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఆమె క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక తన భర్త నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత కెరియర్ పరంగా మరింత బిజీగా దూసుకుపోతున్న ఈమె సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా నటిస్తూ బిజీ షెడ్యూల్ ను మెయింటెన్ చేస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు సిటాడెల్ అనే వెబ్ సిరీస్ చేస్తున్న విషయం తెలిసిందే. మరొకవైపు ఖుషి సినిమాలో కూడా నటిస్తోంది.

ఒకవైపు సిటాడెల్ వెబ్ సిరీస్ , మరొక వైపు ఖుషి సినిమాల షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ దాదాపు ఒక సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనుందని సమాచారం. అయితే తాను ఇలా ఒక సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తానని చెప్పడంతో అభిమానులు సైతం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా తాను మయోసిటీస్ అనే భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోవడానికి ఆమె ఇలా ఒక ఏడాది పాటు సినిమాలకు దూరం కాబోతోందట.

ఇదిలా ఉండగా తాజాగా సమంతకు సంబంధించిన ఒక వార్త నెట్టింట చాలా వైరల్ గా మారుతుంది. అదేమిటంటే ఆమె ఒక స్టార్ హీరోతో మళ్ళీ నటించడానికి ముచ్చట పడుతోంది అని సమాచారం. అసలు విషయంలోకెళితే సమంత మరొకసారి రాంచరణ్ తో కలిసి నటించాలని అనుకుంటోందట. రంగస్థలం లాంటి మరొక సినిమా చేయాలి అని తన స్నేహితుల దగ్గర అనుకున్నట్టుగా నెట్టింట ఒక వార్త చాలా వైరల్ గా మారింది. అయితే ఇందుకు కూడా కారణం లేకపోలేదు. రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ కాబట్టి రామ్ చరణ్తో సినిమా చేస్తే ఆమె ఇంటర్నేషనల్ గా పేరు సంపాదించవచ్చని భావిస్తూ.. అందుకే ఇలా కలలు కంటోందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news