జగన్ పరామర్శకు వచ్చారా..? ఎన్నికల ప్రచారానికి వచ్చారా..? -పరిటాల సునీత ఫైర్

-

జగన్ పై రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఫైర్ అయ్యారు. జగన్ పరామర్శకు వచ్చారా..? ఎన్నికల ప్రచారానికి వచ్చారా..? అంటూ నిలదీశారు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత. చావు ఇంటికి వచ్చి జేజేలు కొట్టించుకుంటున్నారని మండిపడ్డారు. మేం తలుచుకుంచే జగన్ ఇక్కడ అడుగు కూడా పెట్టలేరన్నారు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత.

MLA Paritala Sunitha is under fire for criticizing Jagan

నన్ను, నా కుమారుడిని టార్గెట్ చేయడానికే జగన్ వచ్చారన్నారు. జగన్ మాట్లాడిన మాటలు అన్నీ పచ్చి అబద్దాలు అని ఫైర్ అయ్యారు. తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని వాడు లింగమయ్య కుటుంబానికి ఏం న్యాయం చేస్తారు? అని ఆగ్రహించారు పరిటాల సునీత.

Read more RELATED
Recommended to you

Latest news