తెరపైకి దువ్వాడ అక్రమ సంబంధం..కూతుర్ల నిరసన ?

-

తెరపైకి దువ్వాడ శ్రీనివాస్‌ అక్రమ సంబంధం వచ్చింది. టెక్కలిలో మరోసారి ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కుతోంది. గత రెండేళ్లుగా కుటుంబంలో విభేదాలు చోటు చేసుకుంటున్నాయని వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్యే దువ్వాడ శ్రీను, ఆయన భార్య జెడ్పిటిసి దువ్వాడ వాణి ఇద్దరూ వేరు వేరుగా ఉంటున్న సంగతి తెలిసిందే. కుటుంబ కలహాల నేపథ్యంలో గతంలో వరుసగా ఇంచార్జ్ లను మార్చింది వైసిపి పార్టీ.

MLC Duvvada’s family affair is once again in the limelight

ఎన్నికల్లో తనకి టిక్కెట్ కావాలని కోరారు వాణి. భర్తపై రెబల్ గా దిగుతానంటూ గతంలో లీకులు ఇచ్చారు వాణి. అయితే… అధిష్టానం సర్ది చెప్పడంతో వెనక్కి తగ్గారట వాణి. ఇక నిన్న రాత్రి తండ్రి తమ వద్దకు రావాలంటూ దువ్వాడ ఇంటి ముందు నిరసనకు దిగారట దువ్వాడ కూతుర్లు. తమ తండ్రి మరో మహిళతో ఉంటూ.. తమని దూరం పెడుతున్నారని ఆరోపిస్తున్నారు దువ్వాడ భార్య వాణి, కుమార్తె హైందవి. ఇప్పుడు ఈ సంఘటన హాట్‌టాపిక్‌గా మారింది. ఆయన మరో మహిళ ట్రాప్ లొ ఉన్నారని దువ్వాడ కుమార్తె… దువ్వాడ హైందవి కామెంట్స్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version