దిల్లీలో ఐసిస్‌ ఉగ్రవాది రిజ్వాన్‌ అలీ అరెస్ట్‌

-

ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దేశరాజధాని దిల్లీ ముస్తాబవుతోంది. అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఆరోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు పంద్రాగస్టున ఎలాంటి ఉగ్ర చర్యలకు తావులేకుండా ముందస్తు సమాచారంతో పకడ్బందీగా తనిఖీలు చేపడుతున్నారు.

ఈ క్రమంలో పంద్రాగస్టు ముందు దేశ రాజధాని దిల్లీలో స్పెషల్‌ సెల్‌ పోలీసులు రిజ్వాన్‌ అలీ అనే ఐసిస్‌ ఉగ్రవాదిని అరెస్ట్‌ చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. దరియాగంజ్‌ నివాసి అయిన రిజ్వాన్‌ అలీకి ఉగ్రదాడుల ఘటనలతో సంబంధాలు ఉండటంతో ఎన్ఐఏ అతని సమాచారం ఇచ్చిన వారికి 3 లక్షల రూపాయల రివార్డ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఐసిస్‌ పుణె మాడ్యూల్‌లో మెంబర్గా ఉన్న అలీ ఇన్నాళ్లూ పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే కరెక్టుగా స్వాతంత్య్ర దినోత్సవాలకు ముందు ఐసిస్‌ ఉగ్రవాది రిజ్వాన్‌ అలీ దిల్లీలో ప్రత్యక్షం కావటంపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే రిజ్వాన్‌ అలీతోపాటు ఉగ్రదాడులతో సంబంధాలు ఉండి పరారీలో ఉన్న మరో ముగ్గురు ముష్కరుల ఫొటోలను ఎన్ఐఏ విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version