వివేకా హత్య కేసు.. నేడు సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి

-

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రత్యేకంగా ఏర్పాటైన సీబీఐ నూతన దర్యాప్తు బృందం విచారణ ముమ్మరం చేసింది. ఆదివారం రోజున కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్​ రెడ్డిని అరెస్టు చేసింది. మరోవైపు ఎంపీ అవినాష్​కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఇవాళ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.

సీబీఐ నోటీసులు అందుకున్న అవినాష్ రెడ్డి పులివెందుల నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు.
అవినాష్ వెంట ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హైదరాబాద్‌ బయలుదేరారు. ఆయనతో పాటు భారీగా వైఎస్సార్సీపీ నాయకులు వచ్చారు. వివేకా హత్య కేసులో సీబీఐ అవినాష్‌రెడ్డి పేరును సహనిందితుడిగా చేర్చింది.

గతంలోనే అవినాష్ రెడ్డిని నాలుగు సార్లు విచారించిన సీబీఐ.. మరోసారి విచారణకు హాజరు కావాల్సిందిగా స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. కేసులో నిందితులైన గజ్జెల ఉదయ్ శంకర్ రెడ్డి కస్టడీ పిటిషన్, ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్లపై సీబీఐ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. మరోవైపు ఈ భాస్కర్ రెడ్డిని14రోజుల రిమాండ్ విధించగా.. 10రోజులు కస్టడీకి అప్పగించాల్సిందిగా పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై ఇవాళ విచారణ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version