ఉండి టికెట్‌పై ఎంపీ రఘురామకృష్ణరాజు క్లారిటీ

-

ఉండి టికెట్‌ కేటాయించినట్లు తనకు గానీ మారుస్తున్నట్లు ప్రస్తుత అభ్యర్థి రామరాజుకు గానీ చెప్పలేదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. దీనిపై వస్తున్నవన్నీ ఊహాగానాలు మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని తెలిపారు. పార్టీ చెప్పిన స్థానం నుంచే చేస్తానని, అది ఎమ్మెల్యేనా, ఎంపీనా అనేది అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.

రాష్ట్రంలో పింఛనుదారుల మరణాలకు సీఎం జగనే కారణమని రఘురామ ఆరోపించారు. గతంలో పింఛన్లు తీసుకోవడానికి వెళ్లినప్పుడు ఎవరూ చనిపోయిన దాఖలాలు లేవని, ఇప్పుడే ఎందుకు చనిపోతున్నారు? అని ప్రశ్నించారు. సచివాలయాల్లో సిబ్బంది పింఛన్లు ఎందుకు పంపిణీ చేయకూడదని నిలదీశారు. ఎన్నికల వేళ ప్రజలను మభ్యపెట్టేందుకు అధికారపార్టీ నాయకులు ఎలాంటి దారుణాలకు పాల్పడ్డారో అందరూ గమనించాలని ప్రజలకు సూచించారు. మే నెలలో ఎండల తీవ్రత వల్ల ప్రాణహాని లేకుండా జాగ్రత్త వహించాలని చెప్పారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే ప్రస్తుత చీఫ్‌ సెక్రటరీ, డీజీపీలను మార్చాలన్న రఘురామకృష్ణరాజు.. వాలంటీర్లతో రాజీనామాలు చేయించి వారి జీవితాలతో ఆడుకుంటున్నారు’ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news