ఆ సీన్లలో నటిస్తే తప్పేంటి?: అనుపమ పరమేశ్వరన్

-

మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్‌.అనుపమ పరమేశ్వర న్ ఈ చిత్రంలో కథానాయికగా నటించింది.ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. ఇక భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టిల్లు స్క్వేర్‌’కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది.

ఇదిలా ఉంటే… తమ అభిమాన నటి అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో బోల్డ్ పాత్రలో నటించడంతో ఆమె ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ క్రమంలో కథ డిమాండ్ చేస్తే లిప్లాక్ సీన్స్లో నటించడం తప్పేం కాదని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అన్నారు.’నేనిప్పుడు నటిగా చాలా పరిణతి చెందా అని తెలిపారు. ఒకే తరహా పాత్రల్లో నటించి బోర్ కొడుతోంది. టిల్లు స్క్వేర్ మూవీలో లిప్స్క్ సీన్లో నటించడాన్ని కొంత మంది తప్పుబడుతున్నారు. ఆ సినిమా చూడకుండా వారు విమర్శిస్తున్నారు. అలా చేయడం కరెక్ట్ కాదు అని అన్నారు. అలా కామెంట్లు చేసేవారు సినిమా చూసి మాట్లాడాలి’ అని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news