సజ్జలపై ఎంపీ రఘురామ వివాదస్పద వ్యాఖ్యలు !

-

ప్రభుత్వానికి, పార్టీకి సంబంధం ఉండదని, కానీ సంబంధం ఉందని పేర్కొనడం సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారి అవివేకమే అవుతుందని నరసాపురం ఎంపీ నాయకులు రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. పార్టీ ప్రభుత్వం ఒక్కటేనని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అద్భుతమైన నిర్వచనాన్ని ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఇది మెడకాయ మీద తలకాయ ఉన్న ఎవరు కూడా అంగీకరించారన్నారు.

ఏపీ వై నీడ్ జగన్ మోహన్ రెడ్డి గారు అనే కార్యక్రమంలో వాలంటీర్లను, సచివాలయ, ప్రభుత్వం ఉద్యోగులను భాగస్వాములను చేస్తారని, మున్సిపాలిటీలలో మున్సిపల్ కమిషనర్లు కూడా జగన్ మోహన్ రెడ్డి గారికి ఓటు వేయమని ఇంటింటికి తిరిగి ప్రచారాన్ని నిర్వహిస్తారని, ప్రభుత్వ ఖర్చుతో గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ముద్రించిన 24 పేజీల బుక్ లెట్ ను ప్రజలకు పంచుతారని విమర్శించారు.

గతంలో పత్రికల్లో ఇదే మాదిరిగా అడ్వర్టైజ్మెంట్ లు ఇచ్చేవారని, గత ప్రభుత్వం పనులుచేయలేదని పచ్చ రంగులో ముద్రిస్తూ, తామే అన్ని పనులను చేశామని నీలిరంగులో ముద్రించే వారిని గుర్తు చేశారు. ప్రభుత్వ ఖర్చుతో ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లలో గత ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పు అని, ముఖ్యమంత్రిగా ఎవరైనా ఉండవచ్చునని, ఆయన కూడా ఒక ప్రభుత్వానికి అధినేతే అని, గత ప్రభుత్వాన్ని ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు కనీస విజ్ఞత లేకుండా విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏపీ వై నీడ్ జగన్ అనే పార్టీ కార్యక్రమంలో వాలంటీర్లు, ప్రభుత్వ అధికారులు పాల్గొని ఇంటింటికి బుక్ లెట్ పంచడం కరెక్ట్ కాదని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news