సినిమాల్లో నటించండి..రాజకీయాల్లో నటించండి ప్లీజ్‌ -ముద్రగడ

-

సినిమాల్లో నటించండి..రాజకీయాల్లో నటించండి ప్లీజ్‌ అంటూ పవన్‌ కళ్యాణ్‌ కు చురకలు అంటించారు ముద్రగడ పద్మనాభం. పశ్చిమ గోదావరి తాడేపల్లిగూడెంలో కాపు ఆత్మీయ సమావేశం లో ముద్రగడ మాట్లాడుతూ… పవన్ కల్యాణ్ సినిమాలో నటించండి.. రాజకీయాల్లో నటించి యువతను పాడుచేయకండని కోరారు. అధికారంలోకి వస్తే స్వచ్ఛమైన నీరు అందిస్తాం అని చెప్పకుండా, స్వచ్ఛమైన సారా అందిస్తాము అంటున్నారు.. పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేసి ఉంటే బాగుంటుందని సూచించారు.

mudragada about pawan kalyan

చంద్రబాబు గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది…. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ జైలుకు వెళ్లి మద్దతు తెలపడంతో బాబు గ్రాఫ్ పెరిగిందన్నారు. అందుకే 80 సీట్లు తీసుకోవాలని…పవర్ షేరింగ్ అడగండి అని సూచించాను..పవన్ నోట రాలేదన్నారు. కాపు యువత జీవితాలతో ఆడుకోకండి పవన్..యువత నాశనం అయిపోతున్నారని ఆగ్రహించారు. నాకు బద్ధ శత్రువు అయిన చంద్రబాబుతో మీరు వెళ్తూ నన్ను రమ్మంటే ఎలా.. ? జగన్ పెట్టిన పథకాలు అమలు చేయడానికి పవన్, చంద్రబాబులు ఎందుకు..? అని నిలదీశారు ముద్రగడ.

Read more RELATED
Recommended to you

Latest news