వైసీపీ పార్టీ ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంకు బిగ్ షాక్ తగిలింది. ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపై కాపు సంక్షేమ సంఘం తిరుగుబాటుకు దిగింది. ఇందులో భాగంగానే… కాకినాడ కలెక్టరేట్ ఎదుట ముద్రగడ పద్మనాభం కు వ్యతిరేకంగా కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంకు కాపు సంక్షేమ సంఘ సభ్యులు ప్రశ్నలు సంధించారు.
జగన్ సీఎం గా ఉండగా గుర్తుకురాని స్పెషల్ స్టేటస్ ఇప్పుడు గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు. పద్మనాభ రెడ్డి గా పేరు మార్చుకున్న మీకు మా కాపు రిజర్వేషన్ల సంగతి ఎందుకు? అంటూ నిలదీశారు కాపు సంక్షేమ సంఘ సభ్యులు. నిజాయితీ నిబద్ధతతో రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ పై మీకు ఎందుకు కక్ష? సామాన్యులు విద్యుత్ ఛార్జీలు పెంపు గురించి రోధిస్తుంటే ఎందుకు ఉద్యమం చేయలేదు? అంటూ ప్రశ్నించారు కాపు సంక్షేమ సంఘ సభ్యులు.