వంగవీటి మోహనరంగ ఆ పేరులోనే ఏదో తెలియని ఆకర్షణ ఉంది. ఆయన ఈ లోకాన్ని విడిచి మూడు దశాబ్దాలు గడుస్తున్న ప్రజల్లో ఆయన నింపిన స్ఫూర్తి ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. బెజవాడలో ఇప్పటికీ ఏదో మూల వంగవీటి మోహన్ రంగా పేరు చెవుల్లో మారు మ్రోగుతోంది. కాపు కుల నాయకుడిగా ముద్ర పడినా ఆయన అన్ని సామాజిక వర్గాలకు సమానుడే. ఇక వెనుకబడిన వర్గాలకు ఆయన ఓ దేవుడు. అందుకే చనిపోయినా.. అమరుడైనా ప్రజల గుండెల్లో నిలిచాడు. ఆయన బౌతికంగా దూరమైన ఆయన కొడుకు వంగవీటి రాధకృష్ణ మాత్రం ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అచ్చం తండ్రిలాగే ఆయన ఆశయాలను పునికిపుచ్చుకున్నాడు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ గత కొద్ది రోజులుగా రాధా టీడీపీ నుంచి వైసీపీకి వెళ్తారనే టాక్ వినిపిస్తుంది. దీంతో ఆ ప్రచారానికి వంగవీటి రాధా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తన ప్రయాణం టీడీపీ వెంటేనని స్పష్టం చేశారు. ఎవ్వడో పుట్టించిన గాలి వార్తలను ప్రజలు నమ్మొద్దని.. ఒకవేళ ఎవడైనా అలా వార్తలు ప్రచారం చేస్తే.. వారిని నిలదీయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైసీపీ కొనసాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనను అంతమొందించే శక్తి కేవలం టీడీపీకి మాత్రమే ఉందని గుర్తు చేశారు. అలాగే రాష్ట్రం బాగుపడాలంటే ప్రజలందరూ టీడీపీ, జనసేన కూటమిని బలపరచామని స్టేట్ మెంట్ రిలీజ్ చేశారు.