త్వరలోనే 41 A కింద నోటీసులు ఇచ్చి రేషన్ బియ్యం అక్రమ తరలింపు చేసిన వారి అరెస్ట్ లు కూడా ఉంటాయని హెచ్చరించారు మంత్రి నాదెండ్ల మనోహర్. చెక్ పోస్ట్ లలో తనిఖీలు గంటల తరబడి జరుగుతుంది కాబట్టి తాము నష్టపోతున్నామని మంత్రి దృష్టి కి తీసుకుని వెళ్లారు రైస్ మిల్లర్లు,షిప్ యజమానులు. ఇల్లిగల్ కార్యక్రమాలు జరిపి కాకినాడ కి పేరు తీసుకు వద్దామా అని ప్రశ్నించారు మంత్రి నాదెండ్ల.
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ…. కాకినాడను అడ్డాగా మార్చుకుని ఊహించని విధముగా గత ప్రభుత్వం లో రేషన్ బియ్యం అక్రమ తరలింపు జరిగిందని ఆరోపణలు చేశారు. ఒక కుటుంబం కను సన్నల్లో పోర్ట్ నడిచిందని… ఇల్లిగల్ కార్యక్రమాలు అగాలని ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు. చెక్ పోస్ట్ దగ్గర ఇబ్బందులు లేకుండా అదనపు సిబ్బంది ని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్. అవసరం అయితే మరిన్ని చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.