సమస్యల వలయంలో గురుకులాలు.. ఐనా ప్రభుత్వానికి సోయి లేదు : హరీశ్ రావు

-

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మరోసారి నిప్పులు చెరిగారు. ఈసారి గురుకులాలు, ఐటీఐల్లో కనీస వతులపై ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని ఐటీఐ కళాశాలలు, గురుకులాల్లో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వానికి చీమ కట్టినట్లైన లేదని మండ ిపడ్డారు. పెద్దపల్లి, సంగారెడ్డి, అదిలాబాద్.. ఇలా రాష్ట్రంలో ఎక్కడి ఐటీఐల పరిస్థితి చూసినా పారిశుద్ధ్య నిర్వహణ లేక, టాయిలెట్స్ లేక, అవసరమైన సిబ్బంది లేక అధ్వాన్నంగా తయారైందని తెలిపారు.

ఇక గురుకులాల పరిస్థితి నానాటికీ దిగజారుతోందని.. కలుషిత ఆహారంతో విద్యార్థుల అస్వస్థత, పాము కాటుకు విద్యార్థి మృతి, డెంగీ జ్వరంతో విద్యార్థి దుర్మరణం వార్తలు నిత్యకృత్యమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దోమలు, ఈగలతో గురుకులాలు మురికి కూపాలుగా మారాయని తెలిపారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని.. పెడుతున్న భోజనం కూడా నాణ్యంగా ఉండటం లేదని హరీశ్ రావు అన్నారు. దిక్కులేక కారం అన్నంతో కడుపులు నింపుకుంటున్నారని వాపోయారు. ఇన్ని సమస్యల మధ్య విద్యార్థులు చదువుపై ఎలా దృష్టి సారిస్తారు? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హరీశ్ రావు నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news