యాత్ర-2 : సీఎం జగన్ బయోపిక్ లో హీరోగా నాగార్జున..?

-

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ జీవితంలోని కీలక భాగమైన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. మహి రాఘవ దర్శకత్వంలో తెరకేకిన్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి.. వైఎస్ఆర్ పాత్రలో అద్భుతంగా నటించారు. అయితే యాత్ర సినిమా తర్వాత మహి రాఘవ ఇప్పటి వరకు ఏ సినిమా ప్రకటించలేదు. తాజా సమాచారం మేరకు.. మహి రాఘవ ఇప్పుడు యాత్ర-2 కి సిద్ధమైనట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు చేసిన పాదయాత్ర ఆధారంగా ఈ సినిమా ఉండబోతుందట. అలాగే వైఎస్ జగన్ సీఎం అయ్యేవరకు జరిగిన పరిణామాలు కూడా ఈ సినిమాలో ఉండబోతున్నాయట. అలాగే ఇందులో జగన్ పాత్రను కింగ్ నాగార్జున పోషించనున్నాడని సమాచారం. ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version