నాగేంద్ర అరెస్ట్ ఎప్పుడు…? అతను కోలుకున్నాడా…?

-

విజయవాడ యువతీ దివ్య తేజస్విని హత్యకేసు నిందితుడు నాగేంద్ర ఇంకా కోలుకోలేదు. నాగేంద్ర అరెస్ట్ విషయంలో తర్జనభర్జన పడుతున్నారు పోలీసులు. గుంటూరు జిజిహెచ్ లో నాగేంద్ర చికిత్స పొందుతున్నాడు. గుంటూరు జిజిహెచ్ సూపరెండేంట్ తో నాగేంద్ర ఆరోగ్య పరిస్థితి గురించి అలాగే ఎపుడు డిశ్చార్జ్ అనే వివరాలు విజయవాడ పోలీసులు తెలుసుకునే అవకాశం ఉంది.

వైద్యుల వివరాల మేరకు నాగేంద్రను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. జిజిహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి మాట్లాడుతూ… విజయవాడ దివ్య తేజశ్విని హత్య కేసు నిందితుడు నాగేంద్రబాబు జిజిహెచ్ లో చికిత్స పొంతున్నాడు అని చెప్పారు. నాగేంద్రబాబు ఆరోగ్యం మెరుగు పడుతుందని అన్నారు. మొదట హాస్పిటల్ లో చేరినప్పుడు కత్తి పోట్లతో ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉందన్నారు. 12 రోజుల నుండి జిజిహెచ్ వైద్యులు చికిత్స అందిస్తున్నారని చెప్పారు. ఆపరేషన్ చేసిన సమయంలో వేసిన కుట్లు తీశారన్నారు. రెండు రోజుల తర్వాత నాగేంద్రబాబు డిశ్చార్జి పై వైద్యులు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version