చిరుత దాడిలో మరణించి చిన్నారి కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నట్లు ప్రకటించారు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. పాప కుటుంబానికి టీటీడీ రూ. 5 లక్షలు ..అటవీ శాఖ ఐదు లక్షల మేర పరిహారాన్ని ప్రకటించాయని.. నేను కూడా నల్లపరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున రెండు లక్షలు అందిస్తానని వెల్లడించారు. ప్రస్తుతం పూజల్లో ఉండడంవల్ల ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వీలు కాలేదు..కర్మకాండలు ముగిసిన తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శిస్తానని ప్రకటించారు.
తిరుమల నడకదారిలో పులి దాడిలో మరణించిన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేయమని కోరానని..దీనికి సంబంధించి లక్షల తల్లిదండ్రులు కూడా విచారించమని చెప్పానని వెల్లడించారు. పోతిరెడ్డి పాళెం నుంచి అలిపిరి మెట్ల వద్ద వరకూ జరిగిన పరిణామాలపై విచారించాలని కోరానని..తల్లిదండ్రులే బిడ్డను చంపారని నేను అనలేదని పేర్కొన్నారు. తల్లిదండ్రులను కూడా విచారించి సమాచారం తీసుకోవాలని చెప్పానని..దాడిపై అటవీ శాఖ అధికారులే అయోమయంలో పడ్డారని పేర్కొన్నారు. ఎలుగుబంటి దాడి అని చెప్పారు పోస్ట్ మార్టం తర్వాత పులి దాడి జరిగిందని వెల్లడించారన్నారు.